Friday, November 22, 2024

డీసెంట్రలైజేషన్‌ గురుంచి మాట్లాడే అధికారం జగన్‌కి లేదు : సోము వీర్రాజు

అనంతపురం : రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కర్నూల్‌లో హైకోర్టు పెట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. డీసెంట్రలైజేషన్‌ గురుంచి మాట్లాడే అధికారం జగన్‌కి లేదని, విశాఖను స్మార్ట్‌ సిటీ పేరుతో కేంద్రం అభివృద్ధి చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీది అని, కుటు-ంబ పార్టీలది కాదు అన్నారు. వికేంద్రీకరణకు కేంద్రం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచులకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. అనంతపురంలో అధిక వర్షాలకు పంట వేసిన రైతులు నష్టపోయారన్నారు. చెరువు కట్టలు తెగిపోయి.. పంటలు పాడయ్యాయి అన్నారు. అనంత నగరం వరదల్లో మునిగితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రూ.20 వేల కుటు-ంబాలు ముంపుకి గురయ్యాయని, ముప్పై వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందన్నారు. అనంత నష్టంపై ఎమ్మెల్యే, ఎంపీ ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. విశాఖకు వంద కోట్లు కూడా జగన్‌ ఖర్చుపెట్టలేదన్నారు. క్యాప్టల్‌ అంటే విశాఖలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మారిందని, అమరావతి రాజధానిగా ఉంటు.. కర్నూల్‌లో హైకోర్టు పెట్టడానికి బీజీపీ కట్టు-బడి ఉందన్నారు. కుటు-ంబ పార్టీల మూలంగా అభివృద్ధి లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని, రాయలసీమ నుంచి అనేకమంది ముఖ్యమంత్రులు పాలించినా.. శ్రీభాగ్‌ ఒడంబడిక అమలు కాలేదన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటుకు గత రెండు ప్రభుత్వాలే కారణమన్నారు. ఐదేళ్లుగా కేంద్రం వెనుకబడిన జిల్లాలకు 350 కోట్లు ఇచ్చింది. మంత్రులు పర్యటించి నిధుల వినియోగంపై నివేదికలు తీసుకున్నారు. కర్నూల్‌లో ఎయిర్‌ పోర్ట్‌ సహా రూ.కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు కేంద్రం చేపట్టింది. అనంతలో బెల్‌ సంస్థ సహా అనేక ప్రాజెక్టులు తెచ్చామన్నారు. సత్యసాయిలో నాసిన్‌, కియా సంస్థలు ఏర్పాటు- చేశామని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement