చిట్టీల పేరుతో ఓ మహిళ భారీగా మోసం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అనంతపురంలో చిట్టీల పేరుతో ఓ మహిళ వందమందికి శఠగోపం పెట్టింది. దాదాపు 20 కోట్ల రూపాయల వరకూ వసూలు చేసి మోసం చేసింది. అనంతపురంలోని విద్యుత్ నగర్ కు చెందిన జయలక్ష్మి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. స్థానికంగా చిట్టీలు నిర్వహిస్తోంది. అనేక మంది ఆమెను నమ్మి చిట్టీలు కట్టారు. ఐతే చిట్టీలు కట్టిన వారికి డబ్బులు ఇవ్వకుండా కొన్నాళ్లుగా తప్పించుకుని తిరుగుతోంది. ఈ క్రమంలో ఇంటిని ఖాళీ చేసి వెళ్తుండగా బాధితులు వెంబడించి పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే….స్థానిక ఎస్‌ఐ.. జయలక్ష్మికి వత్తాసు పలుకుతూ ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని.. బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయమని అడిగితే.. ఎవరిని అడిగి చిట్టీలు వేశారంటూ మండిపడుతున్నారని బాధితులు చెబుతున్నారు. అయితే ఎస్ఐ రాఘవరెడ్డి తీరుకు నిరసనగా స్టేషన్ ఎదుట బైఠాయించి మహిళలు ఆందోళన నిర్వహించారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..