Saturday, November 23, 2024

అనంతలో జలప్రళయం …పోటెత్తిన వరదలు

అనంతపురం, ప్రభ న్యూస్ బ్యూరో : 100 సంవత్సరాల జిల్లా చరిత్రలో మొదటి సారిగా కుండపోత వర్షాలు కురిశాయి. ప్రతి సంవత్సరం వర్షం కోసం పూజలు చేసే రైతాంగం.. ఈ అధిక వర్షాలు నిలుపుదల చేయాలంటూ వరుణ దేవునికి హారతి ఇస్తున్నారు. శుక్రవారం నమోదైన వర్షపాతం వివరాలు పరిశీలిస్తే. పి కుంట మండలం లో 237.2 మిల్లీమీటర్ల వర్షం అత్యధికంగా కురిసింది.

63 మండలాలు ఉండగా.. ఒకటి రెండు మండలాలు మినహాయిస్తే అన్నింటిలోనూ వర్షాలు భారీగా కురిశాయి. నల్లచెరువు 185.2, ఒడి చెరువు 146.4, కదిరి 138.6, గాండ్లపెంట 137, నల్లమాడ 135.2, పుట్టపర్తి 130.2, ఆమడగూరు 125, ముదిగుబ్బ 124.6, పెనుకొండ 122.8, ధర్మవరం 122.4, ఎల్లనూరు 124.4, కనగానపల్లి 117.4, పుట్లూరు 111.8, తనకల్లు 110.4, బుక్కపట్నం 110.4, గోరంట్ల 110.2, కొత్తచెరువు 106.2, నార్పల 100.2, సింగనమల 98.6 ఇలా జిల్లా మొత్తం భారీ వర్షాలు కురిశాయి. కుంటలు, చెరువులు అన్ని ఏకమై ప్రవాహంతో పోటెత్తుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement