యల్లనూరు : అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం పార్నపల్లి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అటు యోగి వేమన రిజర్వాయర్ నుండి గేట్లు ఎత్తి పార్నపల్లి రిజర్వాయర్ కు వరదను మల్లించారు. దీంతో యల్లనూరు దిగువనున్న చిత్రావతి నదికి 6000క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్ అధికారులు దిగువకు విడుదల చేశారు. ఈ సందర్బంగా నది పరివాహక ప్రజలు నది వైపు వెళ్ళారాదని ఎస్ఐ ధోని వెంకటరవికిరణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement