రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబును గవర్నర్ వెంటనే బర్తరప్ చేయాలని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవల్ల మురళి డిమాండ్ చేశారు. గురువారం తెలుగుదేశం అర్బన్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోందన్నారు. వడ్డెర కులానికి చెందిన ఒక నిరుపేదకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా భాగం
కావాలని అడిగిన ఆంబోతు మంత్రి వెంటనే దిగిపోవాలన్నారు.
మద్యం దోపిడీ, ఇసుక దోపిడీ, రాష్ట్రంలో దోపిcw రాజ్యం కొనసాగుతుందన్నారు. సిగ్గు శరం ఉంటే ప్రభుత్వం మంత్రి అంబటిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన ఎక్కడైనా ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు కొనలేక అల్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో దోపిడీ రాజ్యం కొనసాగుతోందని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.