Monday, November 25, 2024

ఉపాధ్యాయుడి కుటుంబాన్ని కబలించిన కరోనా…

చేతికి వచ్చిన కొడుకు కరోనా కాటుకు బలి
వారం వ్యవధిలో ఉపాద్యాయుడు రామ్మోహన్ కన్నుమూత
కరోనాతో పోరాడుతున్న భార్య
మరి కొద్ది రోజుల్లో కుమార్తె పెళ్లి

హిందూపురం పట్టణంలోని విద్యానగర్ లో నివాసముంటున్న ఉపాధ్యాయుని కుటుంబంలో కరోనా కల్లోలం రేపింది. ఏడు రోజుల క్రితం కుమారుడు అనిల్ కరోనాతో మృతి చెందగా, తండ్రి రామ్ మోహన్ వైద్య సేవలు పొందుతూ నేడు తుది శ్వాస విడిచాడు. కనీసం భార్య కూతురు చివరి చూపు సైతం నోచుకోని సంఘటన పట్టణంలో విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయ కుటుంబంలో చోటుచేసుకుంది. పట్టణంలో విద్యానగర్ లో నివాసముంటున్న ఉపాధ్యాయుడు రామ్ మోహన్ తన కుమారుడిని ఉన్నత విద్యలు చదివించి ప్రయోజకుడ్ని చేశాడు. తమిళనాడు రాష్ట్రం చెన్నై పట్టణంలో ఓ బ్యాంకులో అనిల్ ఉద్యోగం చేస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులను చూడడానికి వచ్చాడు. ఒక్కసారిగా అనారోగ్యం కారణంగా పరీక్షలు నిర్వహిస్తే కరోనా అని తేలింది. దీంతో వెంటనే కోవిడ్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలను అందించారు.ఇదిలా ఉండగానే తండ్రి రామ్ మోహన్ ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే తనని కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇతనితో పాటు ఇంట్లో ఉన్న భార్య కూతురి ఇద్దరిని పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ అని తేలింది. వైద్య సేవలు పొందుతూ ఏడు రోజుల క్రితం తనయుడి మృతి చెందాడు. అదే బాధలో వైద్య సేవలు పొందుతూ ఉన్న తండ్రి రామ్ మోహన్ వైద్య సేవలు పొందుతూ ఆయన సైతం మృతి చెందాడు. చేతికొచ్చిన కొడుకు మృతి నుంచి కోలుకుని తల్లికి భర్త మరణ వార్త వినాల్సి వచ్చిన సంఘటన ఆ కుటుంబంలో చోటుచేసుకుంది. కనీసం తల్లి, కూతురికి చివరి చూపు సైతం దక్కక పోవడం బాధాకరం. అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించి అందరితో మంచిగా ఉండి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్న రామ్ మోహన్ ఒక్కసారిగా ఇలా మృతి చెందడంపై ఉపాధ్యాయులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామ్మోహన్ సొంతవురు రొద్దం, చిన్నతనం నుండే తోటీవారికి సహాయపడుతూ, ఉపాద్యాయుడుగా మంచి పేరు తెచ్చుకొన్నారు. ఆయన మరణ వార్త ఉపాద్యాయ లోకాన్ని సోకసముద్రంలో ముంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement