అనంతపురం బ్యూరో : పశుసంవర్ధక శాఖలో డాక్టర్ గా విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ రాము ఆత్మహత్య చేసుకున్నారు. పశుసంవర్ధక శాఖ అతిథి గృహంలో ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. డాక్టర్ రాము కోవిడ్ సమయంలో పుట్టపర్తి స్పెషల్ ఆఫీసర్ గా సేవలందించి అందరి అభినందనలు పొందారు. రాము ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు బయటకు రాలేదు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్న గదిలో ఒక లేఖను గుర్తించారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో తనను కొందరు మోసం చేశారని అందులో పేర్కొన్నారు. మహేష్, జాకీర్, విజయ, తదితరుల పేర్లను ప్రస్తావించారు. దీనిపై పోలీసు దర్యాప్తులో వాస్తవ విషయాలు తెలియాల్సి ఉంది. డాక్టర్ రాము ఆత్మహత్య పై ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement