Wednesday, November 20, 2024

కోవిడ్ టీకాలు వేయించుకోండి-సురక్షితంగా ఉండండి …..మున్సిపల్ కమిషనర్

గుంతకల్ – గుంతకల్ పట్టణం లోని అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ నివారణకై కోవిడ్ టీకా వేయించుకొని సురక్షితంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న అన్నారు. గురువారం పట్టణంలోనే 29వ వార్డు సచివాలయంలో కరోనా వైరస్ నివారణకై కోవిడ్ టీకా కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్లు విద్యా రాణి ,సుధాకర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ పట్టణంలోని అన్ని సచివాలయాల్లో కోవిడ్ టీకా వేసే కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. అందువల్ల పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్యాధికారి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ 60 సంవత్సరాల పైబడిన వారందరికీ కోవిడ్ టీకా వేయడం జరుగుతుందన్నారు అలాగే 45 సంవత్సరాలు పైబడిన వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటే అలాంటి వారికి కూడా టీకా వేయడం జరుగుతుందన్నారు. కావున పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వే ప్రబలే అవకాశం ఉన్నదని, పట్టణ ప్రజలు అనవసరంగా రోడ్డుపైకి రాకుండా ఉండాలన్నారు. ఏమైనా పనులు ఉంటే మాస్కు ధరించి సామాజిక దూరం పాటిస్తూ తమ పనులు చేసుకోవాలని అనంతరం ఇంటికి వెళ్లిన వెంటనే శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి విజయ మోహన్ రెడ్డి ,వార్డు సచివాలయ అడ్మిన్ కాశీనాథ్, వార్డు హెల్త్ కార్యదర్శులు ఆర్ పద్మావతి, వీరేసమ్మ, రాజ్యలక్ష్మి ,సౌజన్య, శ్రీవిద్య, రోజి ఉల్లిగమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ కుమార్, మోహన్, సచివాలయ వార్డు ఉద్యోగులు, వార్డు వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు-

Advertisement

తాజా వార్తలు

Advertisement