గుంతకల్లు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. శనివారం ఉదయం గుంతకల్లులో మంత్రి ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన నినాదం 175కు 175, అందుకోసం మాకు అప్పగించిన బాధ్యతలు మేరకు కార్యకర్తలతో సమావేశం అవుతున్నాం అన్నారు. గతంలో గుంతకల్లు నియోజకవర్గం జిల్లాలోనే అత్యధిక మెజారిటీ సాధించిందని, ఎన్నికలు హామీలు సీఎం జగన్ 98.44 శాతం నెరవేర్చారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన ఎన్నికల హామీలు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లిన పరిస్థితి లేదన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు ఏ కష్టం తెలియకుండా పాలన సాగించారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చెపితే ఆరోగ్య శ్రీ గుర్తొస్తుంది, సీఎం జగన్ పేరు చెపితే నవరత్నాలు గుర్తొస్తాయి అన్నారు. మరి చంద్రబాబు పేరు చెపితే గుర్తొచ్చే ఒక్క గొప్ప విషయం లేదన్నారు. పచ్చ మీడియా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కష్టపడుతోందని, వారంతా ఎంత ప్రయత్నించినా చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేరు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహాయ్యా, స్థానిక ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కే.జే కుమార్, స్థానిక ఎంపి తలారి రంగయ్య, చిత్తూరు ఎంపీ ఎన్. రెడ్డప్ప, అనంతపురం జెడ్పీ ఛైర్మన్ గిరిజమ్మ, చిత్తూరు జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement