Friday, November 22, 2024

బాల‌కృష్ణ ఉదారం – హాస్ప‌ట‌ల్ నిర్ల‌క్ష్యం..

నిరుపయోగంగా వెంటిలెటర్లు.. అమర్చే వారేరీ..?
విపత్కర పరిస్థితుల్లోనూ విస్మరించారు.

హిందూపురం అర్బన్ – కరోనా తీవ్రరూపం దాల్చింది. సగటున రోజుకు 200 వరకు కేసులు మోదవుతున్నాయి.ఆసుపత్రులకు వచ్చే రోగుల్లో 30 శాతం మందికి ఆక్సిజన్ అవసరం అవుతోందని అంచనా. పట్టనంలొని ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనంత ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ అందించేందుకు కాన్సంట్రేటర్లు, సి – పాప్ యంత్రాలతో కూడిన ప్రత్యేక బెడ్లు ఉన్నాయి. వాటి ద్వారా సాధారణ రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నారు. అయితే కొందరు రోగుల్లో వివిధ కారణాలతో పరిస్థితి విషమించి, అత్యవసర వైద్యం అందించాల్సి వస్తోంది. అలాంటి సమయంలో వారికి పెద్ద మొత్తంలో ఆక్సిజన్ అందించాలి. అలా అందించాలంటే వెంటిలేటర్ లోనే సాధ్యమవుతుంది.ఇవి లేక ప్రాణాల మీదకు వస్తోంది. ఇక్కడి పరిస్థితిని గుర్తించి గత ఏడాది కరోనా ప్రబలిన సమయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ లక్షలు విలువైన కొన్ని వెంటిలేటర్లను అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ మరి కొన్ని సమాకూర్చాయి . ప్రస్తుతం ఇక్కడ మొత్తం 86 వెంటిలేటర్లు అందుబాటులో వున్నాయి. వున్నప్పటికీ వాటిని ఉపయోగించుకోవడంలో ఆసుపత్రి మేనేజ్మెంట్ చొరవ చూపడం లేదు. కనీసం విపత్కర పరిస్థితుల్లోనైనా వెంటిలేటర్ల ను ఉపయోగించుకొని వందల మంది పేషెంట్లను కాపాడవచ్చు, అయినప్పటికీ వాటిని ఉపయోగించడంలో విఫలమౌతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ నిమిత్తం ఉన్నతాధికారులకు కూడా వచ్చి వెళ్తున్నారు అయినప్పటికీ వెంటిలేటర్లు అమర్చడానికి చొరవ చూపకపోవడం శోచనీయం. వెంటిలేటర్లు లేవని తెలిసి చాలా మంది కరోనా వ్యాధిగ్రస్తుల్లో ఇక్కడ చికిత్స పొందడానికి భయపడి అనంతపురం, బెంగళూరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వెంటిలెటర్లను అమర్చి రోగులకు అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ అందిస్తే, చాలా మంది రోగుల ప్రాణాలనుదక్కించుకునేవారు.రోగులకు వెంటిలేటర్లను అమర్చాలంటే ఐ. సి. యు. లో పనిచేయడానికి ప్రత్యేకంగా ఇంటర్నల్ మెడిసిన్ చేసిన నిపుణులు, అనస్తీషియా (మత్తుమందు) వైద్యుడితో పాటు వాటిని అమర్చే సాంకేతిక నిపుణులు, ప్రత్యేక శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది అవసరం. నిపుణులు లేకపోవడంతో ఏడాదిగా వాటిని ఉపయోగించకుండా పక్కన పెట్టేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. నిపుణులను నియమించకపోవడంతో ఇక్కడి రోగులకు శాపంగా మారింది. ఇప్పటికైనా పట్టణంలో నివాసముంటూ, ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఎమ్మెల్సీ ఇక్బాల్ చొరువ చూపితే సమస్య పరిష్కారం అవుతుందని ఆసుపత్రి వర్గాలు అభిప్రాయ పడుతున్నారు. అన్ని హంగులున్న హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి ని మరింత మెరుగు పరిచవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులు అధికారుల పైన ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement