Thursday, September 19, 2024

స్కోచ్‌ అవార్డులలో సత్తా చాటిన అనంత‌పురం

అనంతపురం, : అవార్డులు, రివార్డులు సొంతం చేసుకోవడం ఒక అలవాటు-గా చేసుకున్న జిల్లా తాజాగా ప్రతిష్టాత్మక 72వ స్కోచ్‌ అవార్డులలో సత్తా చాటింది. ఒక సిల్వర్‌ మెడల్‌ సాధించడంతో పాటు- పలు ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ లను సొంతం చేసుకుంది. అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు టీమ్ ని‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈమేరకు టీ-్వట్‌ చేశారు. ప్రజలకు సేవలందించడంలో జిల్లా యంత్రాంగం మొదటి వరుసలో నిలిచిందని ప్రశంసించారు. జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతో ఇవన్నీ సాధించామని కలెక్టర్‌ కలెక్టర్‌ పేర్కొ న్నారు. ఉపాధి హామీ పథకంతో నీటి యాజమాన్య పథకాన్ని అనుసంధానం చేయడంలో చేసిన కృషికి జిల్లా డ్వామా శాఖకు స్కోచ్‌ సిల్వర్‌ మెడల్‌ దక్కింది. శనివారం సాయంత్రం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన ఫైనల్స్‌ పోటీ-లో స్కోచ్‌ గ్రూప్‌ జిల్లాకు అవార్డు ప్రకటించింది. జిల్లాకు మరో అవార్డు దక్కడంపై కలెక్టర్‌ గంధం చంద్రుడు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకం అమలులో జిల్లాది దేశంలోనే ప్రత్యేక స్థానమని, తాజా అవార్డుకు అందు కు అదనమన్నారు. ఉపాధి హామీ పనుల ద్వారా నిర్మించిన ఇంకుడు గుంతలు, చెక్‌ డ్యాములు, ఫార్మ్‌ పాండ్స్‌, -టె-ంచులు, ఇతర నీటి సంరక్షణ పనుల ద్వారా 2.61 టీ-ఎంసీల నీటిని భూగర్భ జలాలుగా మార్చినందుకు స్కోచ్‌ అవార్డు దక్కిందన్నారు. మరో రెండు శాఖలు అవార్డుకు అడుగు దూరంలో నిలిచి స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ లను దక్కించుకున్నాయి. అవార్డు రేసులో ఫైనల్స్‌ వరకూ చేరి ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ లను సొంతం చేసుకున్న శాఖలలో ఆర్డబ్ల్యుఎస్‌, నీటిపారుదల శాఖలు ఉన్నాయి. ప్లnోరైడ్‌ బాధిత 38 గ్రామాలకు వైఎస్సార్‌ సుజల స్రవంతి ద్వారా రూ.5 రూపాయలకే 20 లీటర్లకే నీటిని అందించినందుకు అర్దబ్ల్యూఎస్‌ అవార్డు రేసులో నిలిచింది. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా సముద్ర మట్టానికి 254 మీటర్ల ఎత్తులో ఉన్న నీటిని సముద్ర మట్టానికి 723 మీటర్ల ఎత్తులో ఉన్న మడకశిర మండలానికి తీసుకువచ్చి అక్కడనుంచి కరువు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు చేసిన కృషికి నీటిపారుదల శాఖకు ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ దక్కింది. సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు ఒక స్వతంత్ర సంస్థ అందించే అత్యున్నత అవార్డుగా స్కోచ్‌ కు పేరుంది. అలాంటి స్కోచ్‌ గ్రూప్‌ జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించింది. కలెక్టర్‌ సహకారంతో రాష్ట్రంలోనే??? స్కోచ్‌ సిల్వర్‌ అవార్డు సాధించిన ఏ-కై-క జిల్లాగా అనంతపురము నిలిచిందని డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement