అనంతపురం క్రైమ్ – జిల్లాలో సెబ్ ఏర్పాటు నుండి మద్యం, ఇసుక అక్రమాల నియంత్రణకు సమిష్టిగా పని చేసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో ఉద్ధేశ్యం నెరవేరుద్దామని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు. జిల్లాలో సెబ్ ఏర్పాటయినప్పటి నుండి మద్యం, ఇసుక అక్రమాల నియంత్రణకు మంచి కృషి చేసిన 61 మంది సెబ్ అధికారులు, సిబ్బంది మరియు సరిహద్దు పోలీసు అధికారులు సిబ్బందికి ఆయన మంగళవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో సన్మానం చేశారు. శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాలు, నగదురివార్డులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,. రాష్ట్ర ప్రభుత్వం మద్యం, ఇసుక అక్రమాల నియంత్రణను ప్రాధాన్యతగా తీసుకుందన్నారు. దీనికోసమే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో ను ఏర్పాటు చేసి అక్రమాల కట్టడికి కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ సంకల్పాన్ని లక్ష్యంగా చేసుకుని క్షేత్రస్థాయిలో గట్టిగా అమలు చేస్తున్నామని గుర్తు చేస్తూ జిల్లాలో ఇప్పటి వరకు సెబ్ ఆధ్వర్యంలో జరిగిన దాడులు, కేసుల నమోదు, అరెస్టులు మరియు రికవరీలకు సంబంధించిన గణాంకాలను వెల్లడించారు. రాష్ట్రంలో జిల్లా సెబ్ కు మంచి పేరు వచ్చిందని… ఇదే స్ఫూర్తి, అంకితభావంతో పని చేసి మద్యం, ఇసుక అక్రమాలను నియంత్రించాలన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో సెబ్ పోలీసులు మంచిగా పని చేశారన్నారు. పోలింగ్ కు ముందు డ్రై డే అమలు, కర్నాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉమ్మడి దాడులు సత్ఫలితాలనిచ్చాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను మరింత అధిగమించేలా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఇసుక, మద్యం అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తారనే భావన అక్రమార్కుల్లోకి వెళ్లాలన్నారు. అంకితబావం, పారదర్శకత, నిజాయితీలతో పని చేసి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈకార్యక్రమంలో సెబ్ అదనపు ఎస్పీ జె రాంమోహన్ రావు, ఎక్సైజ్ ఏ.సి విజయశేఖర్ , పలువురు డీఎస్పీలు, సెబ్ అధికారులు, ఎస్ ఐ లతో పాటు జిల్లాలోని క్యాట్ టీమ్స్ , సైబర్ , ఐ.టి కోర్ టీం, ఈ సర్వేలెన్స్ , తదితర సాంకేతిక పరిజ్ఞాన విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
సమిష్టిగా పని చేసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉద్ధేశ్యం నెరవేరుద్దాం – ఎస్పి సత్య ఏసు బాబు …..
Advertisement
తాజా వార్తలు
Advertisement