Friday, November 22, 2024

రోడ్డు విస్తరణలో 5 అడుగుల వెనక్కి వెళ్లిన ఓ దేవస్థానం

అనంతపురం : అనంతపురం నగర శివారులోని శ్రీ శివ కోటి దేవస్థానం (శివ కామేశ్వరి అమ్మ) రోడ్డు విస్తరణలో భాగంగా దాదాపు 5 అడుగులు కొట్టివేయవలసిన పరిస్తితి. కానీ అది ఏమీ జరగనీయకుండా ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో దేవస్థానాన్ని 5 అడుగులు వెనక్కు లోపలికి జరుపుతున్నారు. ఈ ఆలోచన వచ్చిన వారిని ఎంతైనా అభినందించాలి. ఎందుకంటే ఇది చాలా ఖర్చు శ్రమతో కూడుకున్న పని. పునాది చుట్టూ తవ్వకం జరుగుతుంది. కట్ ఓపెనింగ్స్ తయారు చేయబడతాయి. అవసరమైన పరిమాణం స్టీల్ బీంస్ నిర్మాణం బరువును భరించడానికి స్పష్టమైన అంతరంలో ఈ ఓపెనింగ్‌లలోకి చొప్పించబడతాయి. ఉక్కు బీంస్ సమం చేయబడతాయి. ఒడ్డున ఉంటాయి. అప్పుడు హైడ్రాలిక్ జాక్స్ నిర్మాణాన్ని ఎత్తడానికి ఉపయోగిస్తారు. దైవాన్ని కదిలిస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ. జిల్లాలో జరుగుతున్న ఓ ఆర్కిటెక్చర్ వండర్ అనే చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మన యంత్రాంగం ఈ రోడ్ లో నరికేసిన వందల చెట్ల గురించి ఆలోచించి ఉంటే ఎంత బావుండేది. అని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement