అనంతపురం బ్యూరో : తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పై చిందులు వేశాడు. తాడిపత్రి నియోజకవర్గంలోని సజ్జలదిన్నె ప్రభుత్వ భూమి వ్యవహారంపై ఫిర్యాదు చేసి ఏడాదిన్నర కావస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి పై జేసీ ప్రభాకర్ రెడ్డి పేపర్లు విసిరేశారు. సమాధానం చెప్పాలని కోరారు. కోట్ల విలువచేసే భూమికి సంబంధించి ఫిర్యాదు చేస్తే స్పందించరా అంటూ కలెక్టర్ పై మండిపడ్డారు. దీంతో కలెక్టర్ మీరు వెళ్లచ్చని సమాధానం ఇచ్చారు. ఇది తప్ప నీకేం చేతనవుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ తో అన్నారు. కలెక్టర్ అయ్యే అవకాశం అందరికీ రాదని ఇది దేవుడు ఇచ్చిన వరమని న్యాయం చేయండి అని ఊగిపోతూ కలెక్టర్ పై మండిపడ్డాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. కలెక్టర్ పై దురుసుగా మాట్లాడుతున్న ప్రభాకర్ రెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన గన్ మ్యాన్ ను జేసి ప్రభాకర్ రెడ్డి చేతులతో వెనక్కి నెట్టాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement