Wednesday, November 6, 2024

AP: ఇసుక దోపిడీకి అడ్డుకట్ట.. గ్రామస్తుల వ్యతిరేకతతో వెనుతిరిగిన టిప్పర్లు..

ఎమ్మెల్యే పేరు చెప్పి యధేచ్ఛగా ఇసుక తరలింపు
శ్రీ సత్యసాయి బ్యూరో, అక్టోబర్ 4 (ప్రభ న్యూస్) : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండలం మర్రికొమ్మదిన్నె పంచాయతీలోని యర్రవంకలోళ్లపల్లి సమీపంలో ఉన్న లక్షలు విలువచేసే ఇసుక డంపు నుండి అక్రమంగా ఇసుక తరలించడానికి 6 టిప్పర్లు తలుపుల మండల వాసులు సిద్ధంగా ఉంచారు. ఇది గమనించిన స్థానిక ప్రజలు ఇసుక తరలించకుండా అడ్డుకున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రతి విషయానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేరు చెప్పుకుంటూ కొందరు దౌర్జన్యపరులు తమ పబ్బం గడుపుతున్నారు. అస్సలు ఎమ్మెల్యే కి ఎలాంటి సమాచారం లేకుండానే అడ్డమైన పనులకు శ్రీకారం చుడుతున్న దౌర్జన్య పరులపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేని స్థానికులు కోరుతున్నారు.

సర్పంచ్ భర్త త‌మ మండలం నుండి ఇసుక తరలించడం సరికాదన్నారు. త‌మ మండలానికి ఏవైనా ప్రభుత్వ పనుల నిమిత్తం వాడుకోడానికి వినియోగించుకుంటామన్నారు. ఈ టిప్పర్లు రావడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సర్పంచ్ భర్త గట్టిగా అడ్డుకోవడంతో టిప్పర్లు వెనుదిరిగివెళ్లాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement