Monday, November 25, 2024

కొవిడ్ నిబందనలు పాటించని 53 ఆటోలు స్వాధీనం .. మూడు దుకాణాల‌కు సీళ్లు..

హిందూపురం- కోవిడ్ నిబందనలుకు విరుద్దంగా ప్రయాణీకులను తీసుకెళుతున్న 53 ఆటోలను సీజ్ చేసినట్లు హిందూపురం వన్ టౌన్ సీఐ బాల మద్దిలేటి తెలిపారు. కోవిడ్ రెండవ దశ పట్టణంలో విజృంభిస్తున్న కారణంగా నివారించేందుకు ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను పాటించాలని ప్రజలకు, వాహనదారులకు హెచ్చరికలు జారీ చేసింది.వాటిని పట్టించుకోకుండా తిరుగుతున్న ఆటోలను మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆటోలను సీజ్ చేయడం జరిగిందన్నారు. డ్రైవర్లు మాస్కులు లేకుండా, ఆటోలో ప్రయాణిస్తున్న వారికి కూడా మాస్కులు లేకపోవడం, ప్రయాణికుల మధ్య తెరలు ఏర్పాటు చేయకుండా ప్రయాణిస్తున్న ఆటోలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
కాగా, కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వాణిజ్య దుకాణాలను సీజ్ చేసినట్లు తాహాశీల్దార్ శ్రీనివాసులు తెలిపారు కోవిడ్ రెండవ దశ పట్టణంలో విజృంభిస్తున్న తరుణంలో ల నివారించేందుకు ప్రభుత్వం కోవిడ్19 నిబంధనలను నిబంధనలను ను పాటించాలని పాటించాలని ప్రజలకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ది వాటిని అమలు పరచకుండా మాస్కులు శానిటైజర్ లు భౌతిక దూరం పాటించకుండా వ్యాపారం నిర్వ‌హిస్తున్న మూడు దుకాణాలను సీజ్ చేసిన‌ట్లు, మ‌రో మూడు దుకాణాలకు జరిమానా విధించినట్లు తాహ‌శీల్దారు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement