Tuesday, November 26, 2024

హరహర శంభోశంకర … లేపాక్షిలో ఘ‌నంగా ర‌థోత్స‌వం..

లేపాక్షి – ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పురాతన దేవాలయాల్లో ఒక దేవాలయంగా నిలిచింది లేపాక్షి. శిల్ప‌క‌ళ‌ల‌కు నిలయంగా ప్రపంచంలోనే ఏకశిలా నంది విగ్రహం 15వ శతాబ్దంలో నిర్మించారు. ఈ లేపాక్షి దుర్గపాపనేశ్వర ఆలయంలో ఏటా మహాశివరాత్రి వేడుకల‌ను అయిదు రోజుల పాటు నిర్వ‌హిస్తారు.. ఉత్స‌వాల మూడో రోజైన నేడు ఘ‌నంగా ర‌థోత్స‌వాన్ని నిర్వ‌హించారు. శివపార్వతుల విగ్రహాలు రథంలో ఉంచి లేపాక్షి గ్రామ ప్రధాన వీధిలో రథోత్సవాన్ని జ‌రిపారు…హ‌ర హ‌ర శంభో శంక‌ర అంటూ పెద్ద సంఖ్య‌లో ఈ ఉత్స‌వంలో పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement