హిందూపురం పురపాలక సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పట్టణంలోని రెడ్డి సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డిని పోలీసులు గురువారం గృహనిర్బంధం చేసారు. హిందూపురం పురపాలక సంఘం చైర్మన్ పదవిని జనరల్ కేటగిరీ కింద కేటాయించి ఎన్నికల అనంతరం ఆ పదవిని జనరల్ కేటగిరీకి కాదని బీసీలకు కేటాయించడంపై పై బుధవారం ఆయన తీవ్రంగా తప్పు పట్టారు ఎంతో కాలంగా హిందూపురం పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నంటే ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడిన రెడ్డి సామాజిక వర్గానికి చైర్మన్ పదవి దక్కక పోవడంతో రెడ్డి సంఘం జిల్లా జేఏసీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న నాయకులు పోలీసులు గురువారం రెడ్డి సంఘం జేఏసీ నాయకుడిని సడ్లపల్లి లో తన స్వగృహంలో నిర్బంధించడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement