Tuesday, November 26, 2024

తాడిప‌త్రిలో వైసిపి మైనార్టీ వ్యూహం – 20 మంది కౌన్సిల‌ర్స్ తో టిడిపి ప‌ట్టు…

తాడిప‌త్రి మునిసిపాలిటీ చైర్మ‌న్, డిప్యూటీ చైర్మ‌న్ ల ఎన్నిక రేపు జ‌ర‌గ‌నుంది.. ఈ ఎన్నిక‌ల‌పై న‌రాలు తెగేంత ఉత్కంట నెల‌కొంది..ఎపిలో టిడిపి మెజార్టీ స్థానాలు గెలుచుకున్న ఏకైక మునిసిపాలిటీ ఇది.. ఇక్క‌డ కూడా వైసిపి అభ్య‌ర్ధే ఛైర్మ‌న్ గా చేయాల‌ని వైసిపి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్న‌ది.. తాజాగా స‌రికొత్త వ్యూహానికి తెర తీసింది. ఛైర్మన్ పదవిని మైనార్టీలకు ఇస్తామని ప్రకటించింది. తాడిపత్రిలో గెలిచిన 36 మందిలో 11 మంది ముస్లింలో ఉన్నారు. దీంతో తమ పార్టీ తరపున ముస్లింలకే ఇస్తామని వైసీపీ తెలిపింది. రెండు పార్టీల తరపున ఐదుగురు చొప్పున ముస్లింలు విజయం సాధిచండంతో వైసీపీ ఇచ్చిన ఆఫర్ తో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఈ విషయంలో వైసీపీ మరో వ్యూహాన్ని కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా కోరం హాజరుకాకుండా చేయాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. తమ పార్టీతో పాటు సీబీఐ, స్వతంత్ర కౌన్సిలర్లను ఎన్నికకు హాజరుకాకుండా చూసేందుకు ప్రయత్నిస్తే.. మరింత సమయం దొరుకుతుందనేది అధికార పార్టీ ఆరోచన. ఇది ఇలా ఉంటే తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ 18, వైసీపీ 16 వార్డుల్లో విజయం సాధించగా.. సీబీఐ, ఇండిపెండెంట్ ఒక్కో చోట గెలిచారు. వైసీపికి ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓట్లు ఉండటంతో వారి సంఖ్య 18కి చేరింది. ఐతే టీడీపీ బలం 20గా ఉండటంతో ఛైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీనికోసం టీడీపీ తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు వారిని రహస్య శిబిరానికి తరలించింది. ఓ వైపు టీడీపీ తమ అభ్యర్థులు చేజారకుండా వారిని కాపాడుకుంటోంది. టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరంలో ఆ పార్టీ తరపున గెలిచిన 18 మంది కౌన్సిలర్లతో పాటు ఒక సీపీఐ, ఒక స్వతంత్ర కౌన్సిలర్‌ ఉన్నారు. ఛైర్మన్‌ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకే మద్దతిస్తామనే స్పష్టమైన హామీతోనే ఇతరులిద్దరూ శిబిరంలో కొనసాగుతున్నారు. 20 మందిలో ఏ ఒక్కరూ చేజారే అవకాశం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి దీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ ప్రతిపాదించే ఛైర్మన్‌ అభ్యర్థికే తాము మద్దతిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ తాడిపత్రి మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌రెడ్డికి ముందుగానే విప్‌ సమర్పించారు. దీంతో రేపు జ‌రిగే ఎన్నిక‌ల‌లో ఎవ‌రు పై చేయి సాధిస్తార‌నే దానిపై స‌ర్వ‌త్రా స‌స్పెన్స్ కొన‌సాగుతున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement