నష్టంశిరివెల్ల( గాంధీనగరం) : మండల పరిధిలోని గంప్రా మాన్ దీన్నే గ్రామ మజార గ్రామమైన గాంధీ నగరంలో గల చేపల చెరువు విష ప్రభావానికి గురి అయ్యింది సుమారు పది గంటలకు పైగా బలమైన చేపలు మృత్యువాత పడ్డాయి సుమారు ఒకటిన్నర సంవత్సరం నుండి కంటికి రెప్పలా కాపాడుకొని పెట్టుబడి పెట్టే పెంచి పోషించిన రైతుకు భారీ నష్టం వాటిల్లింది కేవలం మూడు రోజుల వ్యవధిలో చేపల పట్టి ఎగుమతి చేయాలనుకున్న సమయంలో ఇలా జరగరాని సంఘటన జరిగి చేపలు మృత్యువాత పడడం తో రైతుకు కోలుకుని దెబ్బతీసిందని భాదిత కుటుంబం కన్నీటిపర్యంతమయ్యారు గ్రామ సమీపంలోని రైతుకు సంబంధించిన ఒక ఎకరా విస్తీర్ణంలో తో పాటు మరో ఎకరాల విస్తీర్ణం గల చెరువును కౌలుకు తీసుకొని లక్షల రూపాయలు వెచ్చించి చేపల పెంపకం చేపట్టి చివరి క్షణంలో చేపల దిగుబడి చేతికి అందే సమయం లో తీరని నష్టం వాటిల్లడంతో రైతు కుటుంబం దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడుతున్న ది కంటికి రెప్పలా కాపాడుకొని ఒక్కొక్క చేప సుమారు 30 కిలోల పరిమాణంలో ఉండే విధంగా సాగు చేసుకున్న చేపలు మృతిచెందడంతో బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు విష ప్రభావం ఏ విధంగా సంభవించింది ఎలా మృతి చెందాయి అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేసి బాధిత రైతుకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామ ప్రజలు సూచించారు విష ప్రభావం జరిగి సుమారు 24 గంటలు గడుస్తున్నప్పటికీ మత్స్య శాఖ అధికారులు గాని సచివాలయ అధికారులు గాని పంచాయతీ అధికారులు గాని కనీసం పరిశీలించడానికి సైతం రాకపోవడం దౌర్భాగ్యం అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి జరిగిన భారీ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నష్టపరిహార ప్రతిపాదనలు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు సూచించారు
Advertisement
తాజా వార్తలు
Advertisement