Saturday, November 23, 2024

గెలుపు ఓటమిని సమానంగా స్వీకరించాలి – డిఎస్పీ మహబూబ్ బాషా

హిందూపురం, ప్రజాసేవ చెయడానికి ప్రజల చేత ప్రజాప్రతినిథిని ఎన్ను కొవడానికి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని దీనిని ప్రజా తీర్పుగా భావించి అభ్యర్థులు స్నేహ పూర్వకంగా మెలగాలని కమీషనరు డాక్టర్ వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులతో శనివారం మున్సిపల్ కార్యాలయంలో హిందూపురం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు , డీఎస్పీ మహబూబ్ బాషా , టౌన్ సి.ఐ బాల మద్దిలేటి టూ టౌన్ సిఐ మన్సూర్ ఉద్దీన్ ,రూరల్ ధరణి కిషోర్ రూరల్ ప్రత్యేక సమావేశమయ్యారు. ఈనెల 14 న జరుగనున్న కౌంటింగ్ నేపథ్యంలో అభ్యర్థులకు నియమ నిబంధనలు తెలియజేశారు. కౌంటింగ్ సెంటర్ వద్దకు ఒక అభ్యర్థి తనతో పాటు ఒక ఏజెంట్ ను కలిపి ఇద్దరు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారన్నారు.
ఎలక్ట్రానిక్ వస్తువులు సెల్ ఫోన్లు, క్యాలిక్యులెటర్లు తీసుకొని కౌంటింగ్ సెంటర్ లోనికి రాకూడదన్నారు.
కౌంటింగ్ సెంటర్ మొత్తం సీ సీ కెమెరా ల నిఘాలో వుంటాయన్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద 30 పోలీస్ యాక్టు, 144 సెక్షన్లు అమలులో ఉన్నందున జనాలు గుంపులు, గుంపులు గా తిరుగరాదన్నారు.
అభ్యర్థులు గెలుపోటములు సమానముగా భావించి ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తావివ్వకుండా సంయనము పాటించాలన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్థులు ఏజెంట్ లు ఇతర అభ్యర్థులు ఏజెంట్ లతో ఎలాంటి వాగ్వివాదాలకు దిగారాదని.. ఏవైనా సందేహాలు వుంటే సంబంధిత R.O తో సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. పట్టణంలో ఎలాంటి సంభరాలు, ఉరెగింపులు కు అనుమతులూ లేవన్నారు. నిభందనాలు ఉల్లంగిస్టే చర్యలు తప్పవన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement