Saturday, November 23, 2024

ఎమ్మెల్యే కేతిరెడ్డి దిష్టిబొమ్మ దహనం

అనంతపురం జిల్లా కలెక్టర్ ను దూషించిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో గురువారం పరిగి వైయస్సార్ సర్కిల్లో కేతిరెడ్డి దిష్టిబొమ్మను సీపీఎం అనంత దక్షిణ ప్రాంతం కార్యదర్శి ఇంతియాజ్ ఆధ్వర్యంలో దహనం చేసారు. సివిల్ సర్వీస్ లో ఐఏఎస్ పాసైన కలెక్టర్ గంధం చంద్రుడు పై కేతిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ పథకాలను అమలుపరిచే దాంట్లో రాష్ట్రంలోనే ముందున్న కలెక్టర్ ను దూషించడం కేతిరెడ్డికి తగదని, ఆయన స్థాయికి మించి మాట్లాడుతున్నారని వెంటనే ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి చర్యకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెద్దన్న, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement