Friday, November 22, 2024

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు – ఆర్డిఓ మధుసూదన్

ధర్మవరం అర్బన్ – ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి వారిపై చర్యలు తప్పవని ఆర్డిఓ మధుసూదన్ తెలిపారు. స్థానిక బిఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన కౌన్సిలర్ల అభ్యర్థులతో కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అధ్యక్షత వహించగా ఆర్డిఓ మధుసూదన్, డిఎస్పి రమాకాంత్, సిఐ కరుణాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డిఓ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోటీచేసిన అభ్యర్థుల తో పాటు ఒక్క కౌంటింగ్ ఏజెంట్ ను మాత్రమే లోపలకి అనుమతించడం జరుగుతుందని సంబంధిత ఎన్నికల అధికారి నిర్ణయాన్ని అందరూ పాటించాలన్నారు. మొత్తం 30 వార్డులకు గాను 95 మంది అభ్యర్థులు పోటీ చేశారని ఇందుకోసం 14 రూముల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచే కౌంటింగ్ ను ప్రారంభిస్తామని మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ప్రతి అభ్యర్థి కౌంటింగ్ సమయంలో ఎన్నికల అధికారి సూచనలను తప్పకుండా పాటించాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి కౌంటింగ్ ఏజెంట్ లకు పాసులను అందించడం జరుగుతుందని కావున అన్ని రాజకీయ పార్టీల నాయకులు కౌంటింగ్ విజయవంతం చేసేందుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారు లక్ష్మీ నారాయణ శర్మ, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement