అనంతపురం – జిల్లాలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతగా కొనసాగుతున్నది.. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.. నేటి ఉదయం 9 గంటల సమయానికి 11.61 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్
వెల్లడించారు.కాగా, అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని నెహ్రూ మున్సిపల్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.
పోలింగ్ శాతం వివరాలు… 9 గంటల వరకు..
అనంతపురం – 9.87
ధర్మవరం – 14.68
గుత్తి – 8.81
గుంతకల్ – 9.69
హిందుపూర్ – 7.04
కదిరి – 13.53
కల్యాణదుర్గ – 16.44
మడకసిర – 17.83
పుట్టపర్తి – 14. 57
రాయదుర్గం – 14. 71
తాడిపత్రి – 15.77
అనంతపురం జిల్లాలో 13.72 శాతం పోలింగ్ …
Advertisement
తాజా వార్తలు
Advertisement