Saturday, November 23, 2024

అనంతలో తాడిపత్రి తప్ప అన్నింటా వైసిపిదే విజయం..

అనంతపురం: అనంతపురం కార్పొరేషన్ తో పాటు , 8 మున్సిపాలిటీలు 02 నగర పంచాయతీలకు జరిగిన ఎన్నిక‌ల‌లో తాడిప‌త్రి మునిసిపాలిటీ మిన‌హా అన్ని స్థానాల‌ను వైసిపి కైవ‌సం చేసుకుంది.. తాడిప‌త్రిలో జెసి బ్ర‌ద‌ర్స్ త‌మ ప‌ట్టు నిలుపుకున్నారు.. 13 జిల్లాలో జ‌రిగిన మొత్తం 71 మునిసిపాలీటిల‌కు గానూ తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న ఏకైక మునిసిపాలిటీ తాడిపత్రి కావ‌డం విశేషం. ఇక అనంతపురం కార్పొరేషన్ మొత్తం స్థానాలు 50 ఉండగా, వైసీపీ 48, టీడీపీ 0, ఇండిపెండెంట్ 2 స్థానాల్లో గెలుపొందారు. ధర్మవరం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 30 ఉండగా, వైసీపీ 30 స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది .
గుత్తి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 19 ఉండగా, వైసీపీ 18, టీడీపీ 1 స్థానంలో గెలిచింది. గుంతకల్ మున్సిపాలిటీ మొత్తం వార్డులు 34 ఉండగా, వైసీపీ 25, టీడీపీ 7, సీపీఐ 1 స్థానంలో ఘన విజయం సాధించింది. హిందూపురం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 38 ఉండగా, వైసీపీ 29, బీజేపీ 1, టీడీపీ 6, ఎంఐఎం 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచింది.
కదిరి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 36 ఉండగా, వైసీపీ 30, టీడీపీ 5, ఇండిపెండెంట్ 1 స్ధానంలో విజయం సాధించింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 24 ఉండగా, వైసీపీ 19, టీడీపీ 4, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించింది. మడకశిర మున్సిపాలిటీ మొత్తం వార్డులు 20 ఉండా, వైసీపీ 15, టీడీపీ 5 స్థానాల్లో గెలిచింది. పుట్టపర్తి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 20 ఉండగా, వైసీపీ 14, టీడీపీ 6 స్థానాల్లో గెలిచింది. రాయదుర్గం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 32 ఉండగా, వైసీపీ 30, టీడీపీ 2 స్థానాల్లో గెలిచింది.
తాడిపత్రి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 34 ఉండగా, టీడీపీ 18, వైసీపీ 14, సీపీఐ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలుపొందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement