Friday, November 22, 2024

AP: సైబర్ నేరస్తుల భరతంపట్టిన పోలీసులు.. రూ.లక్షలు డ్రా చేసిన ఇద్దరు అరెస్టు

అనంతపురం, ఫిబ్రవరి 3 (ప్రభ న్యూస్ బ్యూరో) : అనంతపురం జిల్లా పోలీసులు సైబర్ నేరస్తుల భరతం పడుతున్నారు. జిల్లా ఎస్పీ అనుబురాజన్ నేతృత్వంలోని పోలీసు బృందాలు దీనిపై తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరస్తులను అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేస్తున్నారు. అనంతపురంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సైబర్ సెల్ టీం ఈ నేరాల పరిశోధనకు విశేష కృషి చేస్తోంది.

తాజాగా బీహార్ కు చెందిన ఇద్దరు సైబర్ నేరస్తులను శనివారం జిల్లా ఎస్పీ అరెస్టు చేయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు మంజూరు చేస్తున్న పథకాల విషయంలో సులభంగా డబ్బును డ్రా చేసుకునేందుకు (ఆధార్ ఎనేబుల్ ) ద్వారా వేలిముద్రవేసి డబ్బు డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరస్తులు అనంతపురం జిల్లాలోని గుత్తి మండలంలో 50మంది లబ్ధిదారుల నుంచి డబ్బు డ్రా చేసుకున్నారు.

దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో బీహార్ రాష్ట్రం పూర్నియా జిల్లా మహారాజపూర్ కు చెందిన 34ఏళ్ల‌ నూర్ ఇస్లాం, పూర్ణియా జిల్లాకు చెందిన మహమ్మద్ ఇస్రాఫీల్ లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరు దేశవ్యాప్తంగా 300మందికి పైగా బాధితుల నుంచి రూ.39, 48, 304 లను కాజేశారు. దీని మీద గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్టు చేయగా.. మరో నిందితుడు బబురుద్దీన్ పరారీలో ఉన్నాడు. ఈ ముఠా వ్యవహారం గురించి గుత్తి పోలీస్ స్టేషన్ లో 308/2023 కేసు నమోదైంద‌ని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ తమిళనాడు తదితర ప్రాంతాల్లో కేసులు నమోదైన‌ట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసిన పోలీసులకు అభినందనలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement