Saturday, November 23, 2024

పోలీసు అమర వీరుల వారోత్సవాలు: ఆయుధాల ప్రదర్శన

విద్యార్థి దశ నుండే ఆయుధాల గురించి అవగాహన కల్గి ఉండాలని అనంతపురం రేంజ్ డి.ఐ.జి కాంతి రాణా టాటా , జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి  అభిప్రాయపడ్డారు. మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని డి.ఐ.జి, ఎస్పీలు  ప్రారంభించారు. పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాలను  ప్రదర్శనలో ఉంచి ప్రజలకు అవగాహన చేశారు. ప్రతీ ఏటా అమర పోలీసులను స్మరించుకుంటూ నిర్వహించే పోలీసు అమర వీరుల వారోత్సవాలులో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని కోదండ రామాలయం కళ్యాణ మండపంలో పోలీసులు తమ దైనందిన విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, పరికరాలు, సాధనాలను ప్రదర్శనలో ఉంచారు. సుశిక్షుతులైన సిబ్బందిచే సందర్శనకు విచ్చేసిన ప్రజలకు ఆయుధాల గురించి అవగాహన చేశారు.  సందర్భంలో ఎలాంటి ఆయుధాన్ని వినియోగిస్తారు, వాటి పని తీరు గురించి  ఈసందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement