అనంతపురం జిల్లాకు చెందిన నేత మాజీ మంత్రి, మాజీ ఎమ్మల్సీ శమంతకమణి, ఆమె కుమారుడు ఆశోక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.. ఈ మధ్యే శమంతకమణి కూతురు యామినీబాల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పగా.. ఈ రోజు తన కుమారుడు అశోక్‌తో పాటు వైసీపీకి రాజీనామా చేశారు… కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. 1980లో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇక, 1989-1991 వరకు మంత్రిగా సేవలు అందించారు.. ఆ తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు.. ఇక, 2014లో తన కూతురు యామినీబాలకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు.. కానీ, 2019 నాటికి రాజకీయాలు మారిపోయాయి. సింగనమల నియోజకవర్గ టికెట్ మరోసారి వారికి దక్కకుండా పోవడంతో.. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్ సమక్షంలో శమంతకమణి, యామినీబాల, అశోక్ వైసీపీలో చేరారు.. కాగా, ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి శింగనమల టికెట్ ఆశించి భంగపడ్డారు యామినీ బాల.. దీంతో, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె.. ఈ మధ్యే వైసీపీకి రాజీనామా చేశారు..
కాగా, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శింగనమల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు యామినీ బాల.. అప్పుడు ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది.. కానీ, 2019 ఎన్నికల్లో అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న యామినిబాలకు బదులు కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు చంద్రబాబు.. ఇక, తన కుమార్తెకు టికెట్ కోసం చివరి వరకు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శమంతకమణి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.. దీంతో.. టీడీపీకి ఎమ్మెల్సీగా ఉన్న శమంతకమణి, ఆమె కూతురు మాజీ ఎమ్మెల్యే యామిని బాల.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. టీడీపీకి రాజీనామా చేసి.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.. ఇప్పుడు వైసీపీ టికెట్ దక్కకపోవడంతో.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.