అనంతపురం: దొంగలు కొట్టేసిన సెల్ ఫోన్ల రికవరీలో అనంతపురం పోలీసులు రికార్డు సృష్టించారు. రూ.18.85 కోట్ల విలువ చేసే 10,195 ఫోన్లను రికవరీ చేశారు. అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో మంగళవారం రికవరీ మొబైల్ ఫోన్ల మేళా నిర్వహించారు. .. రూ.3.45 కోట్ల విలువ చేసే 1309 మొబైల్ ఫోన్లు బాధితులకు జిల్లా ఎస్పీ జగదీష్ అంచించారు. చొరీకి గురై దొరకవని ఆశలు వదలిన సెల్ ఫోన్లను పోలీసుల ద్వారా అందుకుని జిల్లా పోలీసుశాఖ పట్ల హర్షం వ్యక్తం చేసిన బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లాల వారీగా రికవరీ ఫోన్లు ఇవి
ఇప్పటి వరకు అందజేసిన 10,195 మొబైల్ ఫోన్లలో అనంతపురం జిల్లావాసులకు- 6504, శ్రీ సత్య సాయి -1012, కర్నూలు- 589, కడప-401, చిత్తూరు-92, గుంటూరు-81, తిరుపతి-55, నెల్లూరు-53, తూర్పు గోదావరి-38, ప్రకాశం-36, కృష్ణ-35, పశ్చిమ గోదావరి-33, విజయవాడ-28, విజయనగరం-21, కాకినాడ-18, శ్రీకాకుళం-15, ఏలూరు-12, ఒంగోలు-09, విశాఖపట్నం-07
ఇతర రాష్ట్రాల నుంచి రికవరీ
కర్నాటక -415, తెలంగాణ-385, కేరళ-93, తమిళనాడు-71, మహరాష్ట్ర-60, పశ్చిమ బెంగాల్ – 39, ఉత్తరప్రదేశ్ – 19, బీహార్-15, అస్సాం-13, రాజస్థాన్-11, ఒడిస్సా-09, గుజరాత్-08, మధ్యప్రదేశ్-05, హర్యాన-03, జమ్ము కాశ్మీర్-03, ఛత్తీస్ ఘడ్-02, జార్కండ్-02, డెహ్రాడూన్-01, డిల్లీ-01, పంజాబ్ -01.