భారీ అనుచరగణంలో అనంత పిఎస్ ముందు ధర్నా
కేసులు నమోదు చేస్తామంటూ పోలీసుల హామీ
తనపై ఉన్న కేసులు కూడా ఎత్తివేయాలని డిమాండ్
అనంతపురం (ప్రభ న్యూస్ బ్యూరో) – వైసిపి అధికారంలో ఉండగా తనపై అక్రమ కేసులు బనాయించిన మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని… డిటిసి శివప్రసాద్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మరికొందరు పై కేసు నమోదు చేయాలని కోరుతూ అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వద్ద మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నాకు దిగారు…నేటి ఉదయం తాడిపత్రి నుంచి 150 కార్ల ర్యాలీతో అయనన అక్కడకు చేరుకున్నారు..వందలాది మంది అనుచరణ గణంతో జెసి అక్కడే బైఠాయించారు..
ఈ నేపథ్యంలో ప్రభాకరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసేందుకు అంగీకరించచారు. దీంతో ఆయన ఆందోళన విరమించారు. కాగా, నల్ల కండువాళ్ళతో తాడిపత్రి నుంచి తన అనుచరులతో బయలుదేరి వచ్చిన ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేస్తారనే నేపథ్యంలో పోలీసులు చాకచకంగా వ్యవహరించారు.. వ్యవహారం ముదరకుండా ఆయన డిమాండ్ల విషయంలో ఏమాత్రం మెలిక పెట్టకుండా అన్నిటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ఆయన ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తనపై పెట్టిన అక్రమ కేసుల గురించి ఎస్పీ మురళీకృష్ణ తో మాట్లాడారు. తనపై తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరారు..