నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం నిన్ననే అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మూడు రోజుల తర్వాతే ఆనందయ్య మందు పంపిణీ జరగనుందట. ఆనందయ్య మందు బాగా ప్రాచుర్యంలోకి రావవడంతో ఈ మందుల కోసం ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు సరియైన జాగ్రత్తలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఆనందయ్య మందు పంపిణీకి కసరత్తు కూడా చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ చక్రధర్‌బాబు నేతృత్వంలో అధికార యంత్రాంగం పంపిణీ జరపనుంది. అయితే మందును తొలుత సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందజేస్తామని ఆనందయ్య ఇప్పటికే తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement