ఆనందయ్య నాటు ముందు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం శాస్త్రీయత అంశంపై సీసీఆర్ఏఎస్ పరిశోధనలు చేస్తున్నది. దీంతో మందు సరఫరాను నిలిపివేశారు. అయితే, ఆనందయ్య మందు పంపిణీ జరుగుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో కరోనా బాధితులు కృష్ణపట్నం క్యూ కట్టారు. ఈ క్రమంలో ఆనందయ్య స్పదించారు.
శుక్రవారం నుంచి మందు పంపిణీ చేస్తారని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మవద్దని ఆయన కోరారు. శుక్రవారం ఆయన వీడియో రూపంలో కరోనా మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు. మందు పంపిణీపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే తిరిగి పంపిణీ చేస్తామని.. ఆ విషయాన్ని మీడియా ద్వారా ప్రకటన చేస్తానని తెలిపారు. అప్పటివరకు ఎటువంటి వాట్సాప్ మెసేజ్ లు నమ్మవద్దని తెలిపారు. ప్రస్తుతానికి తన దగ్గర ఎటువంటి ఔషదం తయారికి సంబంధించిన ద్రవ్యాలు లేవని ఆనందయ్య చెప్పారు.