Thursday, January 9, 2025

AP | తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.. మంత్రి సత్యకుమార్

తిరుప‌తి : తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. స్విమ్స్ లో బాధితులను పరామర్శించిన అనంత‌రం మంత్రి మాట్లాడుతూ… క్యూలైన్లో భక్తులకు ఇలా జరగడం దురదృష్టకరమ‌న్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారన్నారు.

ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకి రూ.25లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారన్నారు. ఇప్పటికే స్వల్ప గాయాలతో హాస్పటల్ కు చేరిన చాలామంది డిశ్చార్జ్ అయ్యారన్నారు.

మరో 35మంది స్విమ్స్ లో చికిత్స పొందుతున్నారన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. పోస్టుమార్టం తర్వాత మృత‌దేహాలను ఆయా గ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాలామంది భక్తులు తమకు శ్రీవారి దర్శనం కల్పించాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement