Saturday, November 23, 2024

బెజవాడలో పేలిన ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఒకరు మృతి, భార్య పిల్లలకు గాయాలు

అమరావతి, ఆంధ్రప్రభ : ఎలక్ట్రిక్‌ బై క్‌లపై ఉన్న మోజు జనంలో ఇప్పుడు భయాన్ని పుట్టిస్తోంది. పైగా వేసవిలో అవి అత్యంత ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. హఠాత్తుగా పేలిపోతూ వినియోగదారుల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. విద్యుత్‌ ద్విచక్రవాహనాలు వినియోగిస్తున్న వాహనదారులు సీటు కింద బాంబు ఉందన్న భయంతో ప్రయాణిస్తూ ఎప్పుడు పేలుతుందో తెలియని ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ విద్యుత్‌ ద్విచక్ర వాహనం బెజవాడలో యజమానిని పొట్టనబెట్టుకుంది. భార్యబిడ్డలు గాయాలపాలై ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో తీరని విషాదం అలముకుంది. నగరానికి చెందిన శివకుమార్‌ ఇటీవల కార్బెట్‌ 14 అనే ఎలక్ట్రిక్‌ బైక్‌ను కొనుగోలు చేశాడు. కాగా రాత్రి బైక్‌ బ్యాటరీ ఛారింగ్‌ పెట్టి పడుకున్నారు.

తెల్లవారుజామున ఒక్కసారిగా పేలిపోయింది. ఈఘటనలో శివకుమార్‌, అతని భార్య హారతి, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మంటలు వ్యాపించి ఇం ట్లోని టీవీ, ఫ్రిజ్‌, ఏసీ ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. గది తలుపులు మూసి ఉండటంతో పొగ అలముకుని లోపల ఉన్న శివకుమార్‌ భార్య, పిల్లలు ఉూపిరాడక అపస్మారక స్దితిలోకి చేరుకున్నారు. స్ధానికులు హుటాహుటినా వచ్చి తలుపులు పగులగొట్టి శివకుమార్‌, భార్య హారతిని ఆస్ప త్రికి తరలించారు. పిల్లలను స్ధానిక ప్రైవేటు ఆస్ప త్రికి తీసుకెళ్ళారు. కాగా ఆస్ప త్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో శివకుమార్‌ మృతి చెందాడు. భార్య హారతి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. శివకుమార్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement