Saturday, November 23, 2024

శ్రీవారి చెంతకు అమరావతి పరిరక్షణ సమితి.. తీర్పు అనుకూలంగా రావడంపై హర్షం..

తిరుపతి సిటీ , ప్రభన్యూస్ : హైకోర్టు తీర్పు ప్రజలకు అనుకూలంగా రావడంతో అమరావతి పరిరక్షణ సమితీ హర్షం వ్యక్తం చేసింది. ఇది రాష్ట్ర ప్రజల విజయమని సమితి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి అన్నారు. శుక్రవారం మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా అలిపిరి పాదాల మండపం వద్ద తెలుగుదేశం పార్టీ, జనసేన, సీపీఐ, బీజేపీ లీడర్లు కొబ్బరికాయలు కొట్టి.. అమరావతి పరిరక్షణ సమితి నాయకులకు మద్దతు తెలిపారు. జేఏసీ కన్వీనర్ శివారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం ఒంటెత్తు పోకడలకు పోకుండా, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని కోరారు. అమరావతి అభివృద్ధి చెందితే 13 జిల్లాలు అభివృద్ధి చెందినట్లు అన్నారు. కాగా, ఈ సందర్భంగా ఇతర పార్టీల నేతలు మాట్లాడారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement