Tuesday, November 26, 2024

Amravathi – ఎపి స‌చివాల‌యంలో త‌నిఖీలు

ఐటి, స‌మాచార విభాగాల‌లో సోదాలు
డేటా డిలిట్ చేసిన‌ట్లు స‌మాచారం
కొత్త డేటా బ‌య‌ట‌కు వెళ్లి ఉండ‌వ‌చ్చ‌ని అనుమానం

అమరావతి: సచివాలయంలోని ఐటీ విభాగంలో బుధవారం ఉదయం పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ కమ్యూనికేషన్‌ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్‌లు, ల్యాప్‌ ట్యాప్‌లు, ఇతర ప‌రిక‌రాల‌ను తనిఖీ చేశారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్‌ల నుంచి డేటా తస్కరణకు, డిలీట్‌ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారుల తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగుల నుంచి పెన్‌డ్రైవ్‌లు, డేటా హార్డ్‌ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. సర్వర్‌లలో డేటా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు రావడంతో పోలీసులు తనిఖీలు చేశారని ఐటీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement