- కేంద్ర హోం మంత్రికి కూటమి సర్కార్ విందు ఏర్పాటు
- 19వ తేదిన ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి
న్యూ ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. కృష్ణా జిల్లా , గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ , ఎన్ఐడీఎం ప్రాంగణాలను కేంద్ర హోం మంత్రి ప్రారంభించనున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి చేరుకుంటారు. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు.
19న ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తదితరులు పాల్గొంటారు. ప్రారంభోత్సవం తర్వాత అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.