Tuesday, November 26, 2024

చంద్రబాబుకు అమిత్ షా ఫోన్

టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రహోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్ర పరిణామాలను వివరించేందుకు రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిని కలుసుకున్న చంద్రబాబు.. సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కలిసి ఏపీలో జరుగుతున్న పరిస్థితులను వివరించారు. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ విషయంపై కూడా రాష్ట్రపతికి వెల్లడించారు. అనంతరం మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేశారు.

అయితే, కశ్మీర్‌ పర్యటనలో ఉన్న అమిత్‌షా.. మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతనం కౌన్సిల్‌ మీటింగ్‌ నిర్వహించడంతో అమిత్‌షాను చంద్రబాబు కలువలేకపోయారు. దీంతో చంద్రబాబు బృందం నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే, చంద్రబాబు కలిసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిన అమిత్‌ షా.. బుధవారం స్వయంగా చంద్రబాబుకు ఫోన్‌ చేశారు. ఏపీలో పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అమిత్‌ షాకు వివరించారు. రాష్ట్రంలో రాజ్యాంగ విధ్వంసం జరుగుతోందన్న చంద్రబాబు.. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి, టీడీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు తదితర విషయాలను అమిత్ షాకు వివరించారు. ఏపీలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కూడా ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: మాదక ద్రవ్యాలకు కేంద్రంగా ఏపీ: పవన్

Advertisement

తాజా వార్తలు

Advertisement