Friday, November 22, 2024

AP: ఉద్రిక్త‌ల మ‌ధ్య‌ ప్రధాని టూర్‌, కొత్తగా రోడ్‌ షో.. మళ్లీ రోడ్డెక్కిన విశాఖ ఉక్కు కార్మికులు

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రధాని మోడీ ఈనెల 11న విశాఖ రాబోతున్నారు. ఈ టూర్‌ కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే బీజేపీ, వైసీపీ నేతలు విడివిడిగా ప్రెస్‌ మీట్లు- పెట్టి ప్రకటిస్తున్నారు. అయితే, ఇందులో చివరి నిమిషంలో ట్విస్టులు చోటు- చేసుకుంటు-న్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ అధికారిక పర్యటను వైసీపీ హైజాక్‌ చేస్తోందన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈమేరకు మార్పులు చేస్తున్నట్లు- తెలుస్తోంది. ప్రధాని మోడీ వైజాగ్‌ టూర్‌ షెడ్యూల్‌ను బీజేపీ నేతలు గత వారమే వెల్లడించారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులతో కలిసి ప్రెస్‌ మీట్‌ పెట్టి మరోసారి ప్రకటించారు.

అయితే ఇందులో ఏడు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంఖుస్ధాపన చేయబోతున్నట్లు- వెల్లడైంది. ఈ ప్రకటనల తర్వాత భోగాపురం ఎయిర్‌ పోర్టు నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. దీంతో ప్రధాని షెడ్యూల్‌లో భోగాపురం పోర్టు శంఖుస్ధాపనను కూడా చేర్చాలని వైసీపీ పట్టు-బడుతోంది. అటు- బీజేపీ కూడా ప్రధాని టూర్‌లో తన మార్కు ఉండాలని భావిస్తోంది. దీంతో చివరి నిమిషంలో పలు మార్పులు తప్పడం లేదు.

మోడీ టూర్‌లోకి రోడ్‌ షో
ప్రధాని మోడీ వైజాగ్‌ టూర్‌ లోకి ఇప్పుడు అనూహ్యంగా రోడ్‌ షో వచ్చి చేరింది. ప్రధాని మోడీ ఎల్లుండి విశాఖకు రాగానే నగరంలో సాయంత్రం రోడ్‌ షో నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. తద్వారా ప్రధాని మోడీ విశాఖకు, అలాగే ఏపీకి చేస్తున్న సాయాన్ని చెప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు- తెలుస్తోంది. ముందు ప్రకటించిన షెడ్యూల్లో ఈ రోడ్‌ షో లేదు. కానీ చివరి నిమిషంలో బీజేపీ నేతలు పట్టు-బట్టి దీన్నిచేర్పించినట్లు- తెలుస్తోంది. ప్రధాని విశాఖ చేరుకోగానే రోడ్‌ షో ఉంటు-ందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు బుధవారంప్రకటించారు. ప్రధాని తన టూర్‌లో ఏడు కీలక ప్రాజెక్టులకు శంఖుస్ధాపన చేయబోతున్నారు.

వీటిలో పలు రోడ్డు ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే కీలకమైన విశాఖ రైల్వే జోన్‌కు మాత్రం ప్రధాని శంఖుస్ధాపన చేయడం లేదు. ఈ విషయాన్ని కూడా బీజేపీ ఎంపీ జీవీఎల్‌ తన ప్రెస్‌ మీట్లో వెల్లడించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ అయినప్పటికీ ఇప్పటికీ కేంద్రం రైల్వే జోన్‌పై పిల్లిమొగ్గలు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానితో శంఖుస్ధాపన చేయిస్తే ఆ మేరకు ఒత్తిడి ఉంటు-ందని వైసీపీ సర్కార్‌ భావించింది. కానీ ఓసారి ప్రధాని శంఖుస్ధాపన చేస్తే దాన్ని పూర్తి చేసే వరకూ బీజేపీపై ఒత్తిడి ఉంటు-ందని కేంద్రం భావించినట్లు- తెలుస్తోంది. అలాగే రాజధాని అంశం కూడా ప్రధాని టూర్‌లో ఉండబోదని జీవీఎల్‌ ప్రకటించారు.

- Advertisement -

స్టీల్‌ ప్లాంట్‌పై మరోమారు రోడ్డెక్కిన కార్మికులు
ప్రధాని టూర్‌ వేళ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు కార్మికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలు తప్పడంలేదు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీ-కరణను నిరసిస్తూ బుధవారం మరోసారి కార్మికులు రోడ్డెక్కారు. స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుకునేందుకు ఏడాదిన్నరగా ఉద్యమాలు చేస్తున్న కార్మికులు బుధవారం నగరంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బైక్‌లను పక్కనబెట్టి నడుచుకుంటూనే ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు కూడా అడ్డుచెప్పే పరిస్దితి లేకపోయింది. ప్రధాని మోడీ విశాఖ టూర్‌ నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కార్మికులు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ దిశగా తమకు సహకరించాలని కార్మికులు కోరుతున్నారు. ఇప్పటికే సీపీఐ నేతలు ప్రధాని టూర్‌ వేళ ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. దీంతో ప్రధాని టూర్‌ ఎలా జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement