Wednesday, November 20, 2024

ఆటా సాయం: ఏపీకి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ విరాళం..

కోవిడ్ వైద్యంలో కీలకమైన ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ ను అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ఏపీ ప్రభుత్వానికి విరాళంగా అందించింది. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను టీటీడీ ఛైర్మన్‌ వైవి. సుబ్బారెడ్డికి అటా ప్రతినిధులు మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద  అందించారు. ప్రాథమికంగా 50 కాన్సంట్రేటర్స్‌ను అందించిన అటా.. మొత్తంగా 600 కాన్ససెంట్రేటర్లను ఏపీ వ్యాప్తంగా అందజేయనుంది. ఈ నేపథ్యంలో ఏపీ  త్వరలోనే కరోనా ఫ్రీ రాష్ట్రంగా కావాలని తాము కోరుకుంటున్నట్లు అటా ప్రతినిధులు తెలిపారు.

కరోనా నివారణ కు అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఛైర్మన్‌ వైవి. సుబ్బారెడ్డి తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆటా సాయంగా నిలిచిందన్నారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా 600 ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ పంపారని కొనియాడారు.  రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేలా పంపారని తెలిపారు. ప్రస్తుతం 50 ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ పంపారని చెప్పారు. ఈ సాయం అందించినందుకు ఆటా సభ్యులందరికీ వైవీ సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement