Sunday, November 24, 2024

America Tour – విప్ల‌వం సృష్టిద్దాం! ఏపీకి పెట్టుబ‌డుల‌తో రండి: ఇన్వేస్టర్లకు నారా లోకేష్ పిలుపు

టెక్నాల‌జీ రంగంలో అవ‌కాశాలు పెరిగాయి
ఏపీలో శరవేగంగా అభివృద్ధికి అడుగులు
ప్రతి వంద రోజుల లక్ష్యంతో పని చేస్తున్నాం
పీ -4 విధానాలతో పేదరిక నిర్మూలనకు కృషి
ఇన్వెస్ట‌ర్స్‌ ఫ్ల్రెండ్లీ మా విధానం.. త‌ర‌లిరండి
పెట్టుబ‌డుల‌కు పెద్ద ఎత్తున అవ‌కాశాలు
పారిశ్రామికవేత్తల భేటీలో మంత్రి లోకేష్

ఆంధ్రప్రభ స్మార్ట్, అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అభివృద్దిలో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొస్తున్నామ‌ని, టెక్నాల‌జీ రంగంలో న‌వీన పోక‌డ‌ల‌తో ముందుకు వెళ్తున్నామ‌ని మంత్రి లోకేష్ అన్నారు. ఏఐతో ఫ్యూచ‌ర్‌లో ఎన్నో అవ‌కాశాలున్నాయ‌ని, విప్ల‌వం సృష్టిద్దాం.. పెట్టుబ‌డుల‌తో త‌ర‌లిరావాల‌ని ఎన్ఆర్ఐల‌కు పిలుపునిచ్చారు. వై2కే బూమ్ నేపథ్యంలో హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో ఐటీ శరవేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ట్రెండింగ్‌లోని ఏఐ అవకాశాలను అందిపుచ్చుకుని ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో శనివారం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించారు. భారత్ లో రాబోయే పాతికేళ్లలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని, పరిపాలనలో ఏఐ వినియోగంతో ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించటానికి తాము కృషిచేస్తున్నట్లు తెలిపారు.

ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నాం..

నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నేతృత్వంలో యువ నాయకత్వం చురుగ్గా పనిచేస్తోందని, మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే ఉన్నారని మంత్రి లోకేష్ తెలిపారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధితో పేదరిక నిర్మూలనకు విజనరీ సీఎం చంద్రబాబు సరికొత్త పీ –ఫోర్ విధానానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఏపీ సమగ్రాభివృద్ధికి ప్రతి వంద రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నామని చెప్పారు.

న‌వీన ఆవిష్క‌ర‌ణ‌ల‌తో ముందుకు..

- Advertisement -

పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యతతో కూడిన మానవ వనరులను అందించడానికి, తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు విద్యారంగంలో కూడా సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి లోకేష్‌ చెప్పారు. నవీన ఆవిష్కరణల కోసం విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ రీసెర్చి సెంట్రిక్‌గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా కేజీ టు పీజీ పాఠ్యాంశాల్లో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామివేత్త ప్రవీణ్ అక్కిరాజు నేతృత్వంలో ఈ సమావేశం జ‌రిగింది. ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌లు పాల్గొన్నారు.

న‌వంబ‌ర్ 1వ‌ర‌కు అమెరికాలోనే..

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు అక్కడి తెలుగు ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారత దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ హైటెక్ సిటీ పేరు చెప్పగానే చంద్రబాబు గుర్తుకు వస్తారు. 2000 సంవత్సరంలోనే విజన్ 2020 పేరుతో ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని అంచనా వేసిన విజనరీ లీడర్ చంద్రబాబు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ఐటీ శాఖా మంత్రి లోకేష్ 2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో మంత్రి లోకేష్ కి స్వాగతం పలికేందుకు టీడీపీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ‘అఖండ’ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు లోకేష్ అమెరికాలో పర్యటించ‌నున్నారు. ఈనెల 29న లాస్ వేగాస్ నగరంలో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ’ 9వ సదస్సుకు హాజరు కానున్నారు. 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటుచేసిన అన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement