Friday, November 22, 2024

అంబేద్కర్ దార్శనికత.. అందరికీ ఆదర్శం.. చంద్రబాబు

అంబేద్కర్ దార్శనికత అందరికీ ఆదర్శమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజంలోని అసమానతలను తొలగించడానికి అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని వివరించారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ దళితులకు అన్ని విధాలా ప్రాముఖ్యతనిచ్చింది… అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అన్నారు బాబు. అంబేద్కర్ గొప్పదనాన్ని భావితరాలకు తెలియజేయాలనే ఆలోచనతో అమరావతిలోని శాఖమూరుని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించామని తెలిపారు.

రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, లైబ్రరీ, పార్కుతో కూడిన అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు ఆనాడు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పేద విద్యార్ధులకు విదేశీ విద్య అందించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఏ ఊరిలో అభివృద్ధి పనులు చేపట్టినా వాటిని మొదటగా దళితవాడ నుంచి మొదలెట్టే సంప్రదాయాన్ని తెచ్చాం…ఇకముందు కూడా అంబేద్కర్ స్పూర్తితో దళిత సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే..ముందుకు సాగుదామని నారా చంద్రబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement