Saturday, November 23, 2024

పవన్​పై సినిమా తీస్తా.. ప‌రిశీల‌న‌లో ‘మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు’ టైటిల్: మంత్రి అంబటి

తాడేప‌ల్లి: జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్‌ వ్యక్తిగత తీరుపై కథ రెడీ అవుతోందని.. ఈ సినిమాకు అనేక టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయని మంత్రి అంబటి తెలిపారు. నిత్య పెళ్లికొడుకు, తాళి-ఎగతాళి, బహుభార్యా ప్రవీణుడు.. మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయని వెల్ల‌డించారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర‌ కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ,. తన శత్రువులను తిట్టాలని అనుకున్న క్రమంలో పవన్‌ కల్యాణ్‌ ‘బ్రో’ సినిమా తీశాడని, అందుకే అది అట్టర్‌ ప్లాప్‌ అయ్యిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు బ్లాక్‌ మనీని వైట్‌ మనీగా మార్చే కుట్రలో భాగంగానే పవన్‌ సినిమాలు వస్తున్నాయని, బ్రో సినిమాలో చంద్రబాబు హస్తం కూడా ఉందని సంచలన ఆరోపణలు చేశారు.

బ్రో సినిమాతో తన శత్రువులను తిట్టాలని పవన్‌ అనుకున్నాడు. అందుకే ప్లాప్‌ అయ్యింది. కలెక్షన్లు రోజురోజుకి దారుణంగా పడిపోతున్నాయి. కనీసం పవన్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్‌ కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే కాంట్రవర్సీ చేసి కాసులు రాల్చుకునేందుకు కక్కుర్తి పడుతున్నారు. కలెక్షన్లు పెంచుకునే క్రమంలో సినిమా అద్భుతమంటూ చెబుతున్నారు అంటూ సెటైర్లు వేశారు అంబటి.

బ్లాక్‌ మనీతో పవన్‌ సినిమాలు
ఈ సినిమా వెనుక ఉంది బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చే కుట్ర జరుగుతుంద‌ని ఆరోపించారు అంబ‌టి. పవన్‌ కొత్త సినిమా నిర్మాత టీడీపీకి చెందిన విశ్వప్రసాద్ అని ఆయనొక ఎన్నారై అని వెల్ల‌డించారు. అమెరికా నుంచి పవన్‌కు వస్తున్న డబ్బు పెద్ద స్కాం అన్నారు. పవన్‌కు ఇవ్వాల్సిన ప్యాకేజీని చంద్రబాబు ముఠా ఇలా తన మనిషి విశ్వప్రసాద్‌ ద్వారా అందిస్తున్నార‌ని ఆరోపించారు. తన సినిమాలకు బ్లాక్‌ మనీ వాడుతున్నారా? అంటూ పవన్‌ను నిలదీసిన అంబటి.. ఇప్పటివరకు ఎంత డబ్బు తీసుకున్నారు?.. బ్రో సినిమాకు ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారు? అని మంత్రి అంబ‌టి ప్ర‌శ్న‌లు కురిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement