విశాఖ తీరంలో భారత నావికాదళం ‘నేవీ డే’ని అట్టహాసంగా నిర్వహించింది. ఆర్‌కే బీచ్‌లో ఇండియన్ నేవీ నిర్వహించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌తో కలిసి హాజరయ్యారు. ఇండియన్ నేవీ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇక నౌకాదళ విన్యాసాలను వీక్షించేందుకు వచ్చిన జనంతో విశాఖ తీరం జనసంద్రంగా మారింది.
ఈ సందర్భంగా నౌకాదళం తన ధైర్యసాహసాలను ప్రదర్శించింది. 8 వేల అడుగుల ఎత్తు నుంచి పారాచూట్ సాయంతో జాతీయ జెండా, నౌకాదళ జెండాను ఎగురవేసి ఔరా అనిపించారు.
యుద్ధ విమానాలు, హెలీక్యాప్టర్లతో విన్యాసాలు చేశారు. అక్కడ మోహరింపజేసిన ట్యాంకర్లు, నౌకలు అందరినీ అలరించాయి. సముద్రంలో బంకర్ పేలుళ్లను కళ్లకు కట్టినట్టు చూపించారు.