పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ నేతలతో కెప్టెన్ అమరీందర్ సింగ్ వరుస భేటీ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అగ్రనాయత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కెప్టెన్ బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరట్లేదని, కాంగ్రెస్ను మాత్రం కచ్చితంగా వీడతానని అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాల కారణంగా కొద్దిరోజుల కిందే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చరణ్జిత్ సింగ్ చన్నీకి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రోజుల వ్యవధిలోనే పీసీసీ అధ్యక్ష పదవి నుంచి సిద్ధూ తప్పుకున్నారు. దీంతో పంజాబ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి.
ఇది కూడా చదవండి: జనసేనానికి షాక్.. పవన్ శ్రమదానానికి నో పర్మిషన్!