అమరావతి నే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ రైతుల చేపట్టిన మహాపాదయాత్రకు ఈరోజు విరామం ఇవ్వనున్నారు. కార్తీక సోమవారం, నాగులచవితి పండుగ కూడా కావటంతో షెడ్యూల్లో స్వల్ప మార్పులతో నిర్వాహకులు ఇవాళ విరామాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకూ అమరావతి రైతుల బృందం ఏడు రోజుల పాటు 96.3 కిలోమీటర్ల మేర నడిచి ఇంకొల్లుకు చేరుకుంది. పోలీసుల ఆంక్షల నడుమ మొక్కవోని దీక్షతో మాహాపాదయాత్ర ముందుకు సాగుతోంది. రేపటి నుండి యధావిధిగా మహాపాదయాత్ర కొనసాగనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement