మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయాలకు వ్యతిరేకంగా అమరావతి రైతులు తమ పోరు ఉద్ధృతం చేస్తున్నారు. 684 రోజులుగా ఉద్యమాన్ని వివిధ రూపాల్లో హోరెత్తిస్తున్న రైతులు, మహిళలు.. నేటి నుంచి ప్రజా పాదయాత్ర పేరుతో ముందడుగు వేస్తున్నారు.తుళ్లూరులో ఉదయం 9 గంటల 5 ఐదు నిమిషాలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. ప్రజా పాదయాత్రకు తొలుత సమ్మతి నిరాకరించినప్పటికీ.. హైకోర్టు ఆదేశాలతో షరతులతో కూడిన అనుమతి పోలీసులు మంజూరు చేశారు. తొలి 6 రోజులు గుంటూరు జిల్లాలో ప్రజా పాదయాత్ర కొనసాగనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement