Tuesday, November 26, 2024

ప్రకాశం జిల్లాలో రాజధాని రైతులు పాదయాత్ర

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ఏడో రోజు కొనసాగుతోంది. శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రలో స్వల్ప మార్పులు జరిగాయి. పర్చూరులో బయల్దేరి మధ్యాహ్నం భోజనానికి నూతలపాడుకు, రాత్రికి దగ్గుబాడు చేరుకుని బస చేసేలా ముందుగా ప్రాణాళికను సిద్ధం చేశారు. అయితే.. షెడ్యూల్ ప్రకారం పర్చూరు నుండి యాత్ర ప్రారంభమై భోజన సమయానికి వంకాయలపాడుకు చేరుకుని అనంతరం ఇంకొల్లుకు యాత్ర బృందం వెళ్తుంది. అనంతరం సోమవారం పాదయాత్రకు అమరావతి రైతులు విరామం తీసుకోనున్నారు.

శనివారం పోలీసులు రాజధాని రైతులకు నోటీసులు ఇచ్చారు. ప్రచార వాహనం సీజ్ చేశారు. కొవిడ్‌, ఇతర నిబంధనలు పాటించలేదంటూ పాదయాత్రికులకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు అందజేశారు. కళాకారుల వాహనాన్ని స్వాధీనం చేసుకుని, పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement