ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి తెలుగు సిలబస్ నుంచి అమరావతి పాఠాన్ని తొలగించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. 2021-22 విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో.. విద్యార్థులపై భారం పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు వివరించారు. ‘అమరావతి’ తో పాటు మరికొన్ని పాఠాలనూ తొలగించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ‘అమరావతి’ పాఠాన్ని సిలబస్ నుంచి తొలగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులపై భారం పడకూడదనుకుంటే పుస్తకం చివర్లో ఉన్న పాఠాలను తొలగిస్తారు గానీ.. రెండవ పాఠమైన ‘అమరావతి’ని ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement