ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. ఏపీ రాజధాని అమరావతే అని వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర పట్టణాభివృద్ధి సహాయ మంత్రి కౌశల్కుమార్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా 28 రాష్ర్టాల్లో కేవలం త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు మాత్రమే మాస్టర్ ప్లాన్లు లేవని కౌశల్ కుమార్ తెలిపారు. మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా మాస్టర్ ప్లాన్లు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వీటిని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందన్న మంత్రి కౌశల్కుమార్ అమరావతికి సైతం మాస్టర్ ప్లాన్ ఉందని, దీనిని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆయన తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement